చందంపేట, ( దేవరకొండ ) జూలై 30 : ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుపేద సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ రెడ్డి, మాజీ చైర్మన్ నరసింహ, మాజీ జడ్పీటీసీ అరుణ సురేశ్ గౌడ్, మాజీ ఎంపీపీ జానీ యాదవ్, సిరాజ్ ఖాన్, యూనిస్, వెంకటేష్ గౌడ్, రామ్ సింగ్, హరికృష్ణ పాల్గొన్నారు.