– తెలుగు నాటక సమాజాల సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
పెన్పహాడ్, మార్చి 24 : ప్రభుత్వం తెలుగు పద్య నాటకాలను ప్రోత్సహించాలని నాటక సమాజాల సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిలకత్తుల పుల్లయ్య, గుండు వెంకటేశ్వర్లు కోరారు. పెన్పహాడ్ మండలం పొట్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి శ్రీ సీతారామాంజనేయ స్వామి కళాకారులచే తడకమళ్ల రామచంద్రరావు రచించిన “దమయంతి స్వయంవరం” నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు పద్య నాటకాలు అంతరించిపోకుండా నేటి కాలపు యువతీ యువకులను ప్రోత్సహించి, కళలకు జీవం పోసే విధంగా పాలకులు తోడ్పడాలని కోరారు. అంతరించిపోతున్న కళలను మళ్లీ ముందుకు తీసుకు రావాలనే సంకల్పంతో ఆనాటి సీనియర్ కళాకారులు నేటి యువతీ యువకులను, బాల బాలికలను ప్రోత్సహిస్తూ చాలా రోజులు కష్టించి ఇలాంటి పద్య నాటకాలు నేర్పించి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం కళాకారులను ప్రోత్సహిస్తూ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటక సమాజాల సమైక్య జిల్లా మాజీ అధ్యక్షుడు కంబాలపల్లి శ్రీనివాస్. దమయంతి స్వయంవరం నాటక సంగీత దర్శకుడు బాసంపల్లి యాదగిరి, జిల్లా బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, నాటక పాత్రధారులు, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న, సీనియర్ జర్నలిస్టు ధనియాకుల వెంకటేశ్వర్లు, చల్లా సత్యనారాయణ రెడ్డి, బెల్లంకొండ యాదగిరి, బాసంపల్లి జగదీష్, ఏలే నారాయణ, ధనియాకుల సత్యనారాయణ, రాగి భాస్కరాచారి, దాచేపల్లి లక్ష్మి, కందిమళ్ల నాగలక్ష్మి, గుత్తికొండ సుదర్శన్ రెడ్డి, నారాయణ, సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పద్మావతి, రఘునాథమ్మ, గోధుమల ఈశ్వరమ్మ, చల్లా సంచాక్షరి, చెరుకు కృష్ణయ్య, చల్లా ప్రసీద, నెమ్మని సాంబయ్య, గురులింగాచారి, నరసింహాచారి పాల్గొన్నారు.

‘ప్రభుత్వం తెలుగు పద్య నాటకాలను ప్రోత్సహించాలి’