తుంగతుర్తి, జూన్ 06 : అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా రైతులు ధాన్యాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తడిసిపోయిందన్నారు. అందుకే అబద్ధాల రైతు వ్యతిరేఖ ప్రభుత్వానికి తగిన శాస్తి చేసేందుకు అవకాశం కోసం రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు యాకూనాయక్, భాస్కర్, వీరన్న, కొండగడుపుల వెంకటేష్, నల్లబెల్లి వెంకటేష్, లింగయ్య పాల్గొన్నారు.