మిర్యాలగూడ(మాడ్గులపల్లి), జనవరి4 : గ్రామా ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. బుధవారం మాడ్గులపల్లి మండలంలో రూ.4.34 కోట్ల వ్యయంతో చిరుమర్తి నుంచి వయా పోరెడ్డిగూడెం, పాములపాడు, బీరెల్లిగూడెం వరకు 10 కిలోమీటర్ల మేర బీటీరోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇసుకబావిగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అనంతరం కుక్కడం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నూకపంగ సోమయ్య తండ్రి వెంకయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసీన్‌అలీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, నాయకులు పొనుగోటి చొక్కారావు, అలుగుబెల్లి గోవిందరెడ్డి, మారుతి వెంకట్‌రెడ్డి, నిమ్మల గోవిందమ్మ, జెర్రిపోతుల రాములుగౌడ్, అంజిరెడ్డి, సీతారాంరెడ్డి, సత్యనారాయణశర్మ, కోటిరెడ్డి, శ్రీశైలం, యాదయ్య, ఇంద్రారెడ్డి, రాబర్ట్, మస్తాన్, శ్రీను పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని బి.అన్నారం గ్రామ మాజీ సర్పంచ్ సారెడ్డి సైదిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో బుధవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరామర్శించారు. ఆయన వెంట రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, సర్పంచ్ అంబటి వీరారెడ్డి, చలికంటి యాదగిరి ఉన్నారు.
వేముపల్లి : మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన జిన్నె లింగారెడ్డి ఇటీవల మృతి చెందగా అతడి కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోసిన్‌అలీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, కోఆపరేటివ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, యాతం మట్టారెడ్డి, సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, లక్ష్మీనరేందర్రెడ్డి, ఎంపీటీసీ నంద్యాల శ్రీరాంరెడ్డి, కళింగరెడ్డి, ఉపసర్పంచ్ తరి సైదులు, గ్రామశాఖ అధ్యక్షుడు సందనబోయిన చంద్రయ్య ఉన్నారు.