దేవరకొండ, సెప్టెంబర్ 6 : దేవరకొండను ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని 16వ వార్డులో రూ.50 లక్షల నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. గతంలో మిషన్ భగీరథ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కారణంగా గుంతలుగా మారిన రోడ్లకు మర్మతులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో దేవరకొండ మున్సిపాల్టీ అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల అభివృద్ధికి ప్రతి నెలా రూ.336 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గత వారంలో రోడ్లకోసం రూ.30 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్‌అలీ, కౌన్సిలర్లు రయీస్, కమిషనర్ వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు పొన్నబోయిన సైదులు, తౌఫిక్ఖాద్రీ, ఇలియాస్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, భీష్మాచారి, పొట్ట మధు, బురాన్ పాల్గొన్నారు.
దేవరకొండ : పట్టణంలోని 15వ వార్డులో రూ.10లక్షలతో పార్కు, రూ.8 లక్షలతో ఓపెన్ జిమ్‌ల పనులకు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యం.. ఆహ్లాదం అందించేందుకు జిమ్‌లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖిలాలో రూ.5కోట్లతో జరుగుతున్న పనులు చివరి దశలో ఉన్నాయన్నారు.
దేవరకొండ : నియోజకవర్గంలోని పలు తండాల్లో మట్టిరోడ్లను బీటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్ల నిర్మాణానికి గిరిజన అభివృద్ధి శాఖ నుంచి రూ.126 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. 38 ఆవాసాలకు రూ.67 కోట్లు, గిరిజనాభివృద్ధి శాఖ నుంచి రూ. 30 కోట్లు, అంతర్గత రహదారులకు రూ.29 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గిరిజన ఆవాసానికి మెరుగైన రహదారులు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, అందుకు కృషి చేసిన మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌కు ఆయన ప్రత్యేక కృతజతలు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్‌అలీ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీనునాయక్, ఉపసర్పంచ్ సామల రవిగౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.