నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్(2012)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఆదివారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. కర్ణన్‌ను రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో భాగంగా వినయ్ కృష్ణారెడ్డి స్థానంలో జిల్లా కలెక్టర్‌గా కర్ణన్ వచ్చారు. జూలై 26న కలెక్టర్‌గా కర్ణన్ బాధ్యతలు చేపట్టారు.
నాలుగున్నర నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణపైనే దృష్టి సారించారు. రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా ఆరు నియోజకవర్గాలు ఉన్నా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా కర్ణన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి సారిస్తున్న తరుణంలో కర్ణన్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నల్లగొండ కలెక్టర్‌గా కర్ణన్ స్థానంలో ఆదివారం రాత్రి వరకు ఇంకా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు.