– గోపా రాష్ట్ర, జిల్లా బాధ్యులు
– నల్లగొండ బీసీ భవన్లో గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
నల్లగొండ రూరల్, జనవరి 16 : గోపా ను మండల, గ్రామ స్థాయిలో మరింత విస్తృత పర్చాలని, గౌడ్ల అభివృద్ధికి సంఘటితం కావాలని గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారింగుల భిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గోపా నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు గౌడ పెద్దలతో కలిసి ఆయన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారింగుల భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని పార్టీలు గౌడ్ లకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో గోపా జిల్లా కమిటీ పక్షాన గోపా సభ్యత్వాలను విస్తృతంగా చేయించి, గోపాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గోపా సభ్యత్వం కలిగిన ప్రతి కుటుంబానికి గోపా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో త్వరలో హెల్త్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.
గోపా జిల్లా అధ్యక్షుడు దంతూరి సైదులు గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో గోపా ఆధ్వర్యంలో 3 వేల సభ్యత్వాలకు పైగా నమోదు చేయించి నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గోప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు, ప్రమాదవశాత్తు గాయపడిన అలాగే పేద గీత కార్మిక కుటుంబాలకు చేయుతనందించే కార్యక్రమాలను త్వరలో చేపడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర బాధ్యులు సుంకరి భిక్షం గౌడ్, పాలకూరి అశోక్ గౌడ్, కొన్నె శంకర్ గౌడ్, అబ్బగోని రమేశ్ గౌడ్, నకిరేకంటి శ్రీనయ్య గౌడ్, గోపా జిల్లా బాధ్యులు నకిరేకంటి కాశయ్య గౌడ్, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య గౌడ్, తండు భాను ప్రకాష్ గౌడ్, జేరిపోతుల భాస్కర్ గౌడ్, సందీప్ గౌడ్, పోలగోని నరసింహ గౌడ్, నేలపట్ల శ్రీధర్ గౌడ్, పోలగాని వెంకటేశ్వర్లు గౌడ్, నర్సింగు వెంకటేశ్వర్లు గౌడ్, జేరిపోతుల శంకర్ గౌడ్, పోగుల నగేశ్ గౌడ్, పెద్ది రమేశ్ గౌడ్, సమ్మెట తిరుమలేశ్ గౌడ్, వట్టికూటి గురుమూర్తి గౌడ్, బోయపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటమ్ రాజు గౌడ్, అయితగోని లక్ష్మీనారాయణ గౌడ్, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, అనంతుల వెంకటేశ్వర్లు గౌడ్, బత్తిని రాజు గౌడ్, అబ్బగోని జలంధర్ గౌడ్, వంగాల జానయ్య గౌడ్, అయితగోని సతీశ్ గౌడ్ పాల్గొన్నారు.