పోగొట్టుకున్న బంగారం బాధితురాలికి అప్పగింత
పోగొట్టుకున్న బంగారం, మొబైల్ ఫోన్, నగదును అరగంటలోనే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ (తండ్రి షాబుద్దీన్) గుర్రంపోడు నుండి తేనేపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో..
గుర్రంపోడు, జూలై 16 : పోగొట్టుకున్న బంగారం, మొబైల్ ఫోన్, నగదును అరగంటలోనే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ పర్వీన్ (తండ్రి షాబుద్దీన్) గుర్రంపోడు నుండి తేనేపల్లి గ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో తన పర్స్‌ను పోగొట్టుకుంది. ఆ పర్స్‌లో సుమారు ఒక తులం బంగారం, మొబైల్ ఫోన్, రూ.2 వేల నగదు ఉంది. ఈ విషయమై బాధితురాలు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన గుర్రంపోడు పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చేపట్టి, కేవలం అరగంట వ్యవధిలోనే పోగొట్టుకున్న పర్స్‌ను గుర్తించి, అందులోని బంగారం, మొబైల్ ఫోన్, నగదుతో సహా మొత్తం 1,50,000 విలువగల సొమ్ము ని బాధితురాలికి తిరిగి అప్పగించారు. పొగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి లభించడంతో బాధితురాలు గుర్రంపోడు పోలీసుల వేగవంతమైన స్పందన, సమర్థవంతమైన విధి నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తూ గుర్రంపోడు ఎస్ఐ తో పాటు పోలీసు సిబ్బంది నాగరాజు, సైదులు, నాగేందర్, నగేష్, శ్రీనుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- gold
- Gurrampodu
- Nalgonda News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

