చలికాలం జీవాలు భద్రం
రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. పెంపకందారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
- మేకలు, గొర్రెలకు వ్యాధులు సోకే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలంటున్న పశువైద్యాధికారులు
ఆత్మకూర్ ఎస్, డిసెంబర్ 20 : రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. పెంపకందారులు అప్రమత్తంగా ఉండి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వాతావరణంలో వచ్చే మార్పులతో జీవాల్లో తుమ్ములు, కండ్లు, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. క్రిములతో సోకే అంటువ్యాధులతో పాటు ఆరు మయట మేత మేయడంతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు…
- జీవాలకు గాలి, వెలుతురు సరిగ్గా వచ్చే విధంగా చూడాలి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు బయటకు వదలకూడదు.
- పాకలను శుభ్రంగా ఉంచాలి. వ్యాధులు సోకినప్పుడు వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలి.
- చలికాలంలో పీపీఆర్ సోకిన జీవాల పెంట, ముక్కు, కండ్ల నుంచి వచ్చే ద్రవాలతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జీవాలకు ముక్కు నుంచి నీళ్లు కారడం ప్రారంభమై ఒకటి, రెండు రోజుల్లో చీమిడి రూపంలోకి మారుతుంది. కండ్లు ఎర్రబడి నీరు కారుతుంది. నోటి లోపలి పొర దెబ్బతిని చిగుళ్లు పొర సెర్రోసిస్ చెందవచ్చు. ఊపిరితిత్తులకు వ్యాధి సోకడం వల్ల దగ్గు వస్తుంది.
- జీవాలు నీళ్ల పారడంతో మూడు, నాలుగు రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు పాటించాలి.
జీవాలపై శ్రద్ధ వహించాలి
జీవాలు చలి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపకందారులు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. పీపీఆర్ (పుర్రు) వైరస్ సోకే అవకాశం ఉంటుంది. దీని నావారణకు నిర్ధిష్టమైన చికిత్స లేదు. రోగాలు రాకుండా దీర్ఘకాలం పనిచేసే అక్రిటెట్రాసైక్లిన్ వాడొచ్చు. నీరసించిన జీవాలకు గ్లూకోజ్ ఎక్కించవచ్చు. పెంపకందారులు పాకలను నిత్యం శుభ్రం చేయాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి.
– వేణుగోపాల్రావు, మండల పశువైద్యాధికారి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

