నల్లగొండ రూరల్, ఆగస్టు 13 : ఎమ్మార్పీ కాల్వ ద్వారా నల్లగొండ నియోజకవర్గ రైతాంగానికి ఏడాది కాలంగా సాగు నీరు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆవేదన చెందారు. వానకాలం సీజన్‌కు నారుమడులు పోసుకున్నా ఇప్పటికీ సాగు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఏఎమార్పీ ద్వారా కనగల్, తిప్పర్తి, నల్లగొండ, మడ్గులపల్లి మండలాలకు చెందిన డి-25, డి -37, డి-39,డి -40 కాల్వలకు వెంటనే సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ సి.నారాయణరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం మీడియాతో భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ ద్వారా ప్రస్తుతం వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నదని, కనీసం ఏఎమ్మార్పీ కాల్వల ద్వారా సాగు నీరు విడుదల చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. సీజన్‌కు ముందే మోటార్లు రిపేరు చేయాల్సిన ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. స్థానిక మంత్రి విదేశాల్లో కాలం గడుపుతూ మాటలతో కోటలు కడుతున్నారని గానీ, చేతలు గడప దాటడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణమే ఏఎమ్మార్పీ కాల్వలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ట్రయల్ రన్ నిర్వహించిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదల చేసి అక్కడ చెరువులు నింపాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు కరీం పాషా, నారబోయిన భిక్షం, బొజ్జ వెంకన్న, మాజీ జడ్పీటీసీలు యాదగిరి, తుమ్మల లింగస్వామి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారయణ, జమాల్ ఖాద్రీ, దోటి శ్రీనివాస్, బీఆర్ఏస్ నల్లగొండ పట్టణ, మండలాధ్యక్షుడు బోనగిరి దేవెందర్, నాయకులు దేప వెంకట్‌రెడ్డి, ఐతగోని యాదయ్య, బడుపుల శంకర్, సందీప్‌రెడ్డి, మెరుగు గోపి, తవిట కృష్ణ, కందుల లక్ష్మయ్య, బద్రి, పిచ్చయ్య పాల్గొన్నారు.