రామగిరి, ఏప్రిల్ 12: విద్యాశాఖ అధికారులు ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమనంలో ఉంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాల శాతం మెరుగ్గా ఉంది. గత ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 16,19వ స్థానాలు దక్కాయి. ఈ పర్యాయం మాత్రం ప్రథమ సంవత్సరంలో 14వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ శాతంతో ఉత్తీర్ణత పెరగడంతో జిల్లా ఇంటర్ విద్యాశాఖ పనితీరుపై హర్షం వ్యక్తమవుతోంది. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ముందజలో ఉన్నారు.
కాగా ఓకేషనల్ విభాగంలో ఈ పర్యాయం ఫలితాల శాతం తగ్గింది. గత సంవత్సరం ప్రథమ సంవత్సరంలోలో 8వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 16 స్థానం దక్కగా, ఈ పర్యాయం ప్రథమ సంవత్సరంలో 27వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 28వ స్థానం దక్కింది. కాగా కస్తూర్బా, గురుకుల పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో సత్తాచాటారు. కాగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 994, ప్రథమ సంవత్సరంలో 468 మార్కులను జిల్లా విద్యార్థులు కైవసం చేసుకోని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు.
అదే విధంగా బీపీసీ ప్రథమ సంవత్సరంలో 438, ద్వితీయ సంవత్సరంలో 993 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. 2025-26 ఫలితాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలోనే ఉన్నాయని ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి దస్రూనాయక్ వెల్లడించారు. అయితే ఒకేషన్ విభాగంలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామన్నారు. ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ సంవత్సరంలో 14వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానం దక్కింది.ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకే రోజు విడుదలైనప్పటికీ రెండింటిలోనూ ప్రయివేటు విద్యార్థులే సత్తా చాటారు. ప్రభుత్వ కళాశాలలో సైతం మెరుగైన ఫలితాలే వచ్చినట్లు విశ్లేషకుల అంచనా. కాగా రెండు సంవత్సరాల ఫలితాల్లో నల్లగొండ జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి, రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాగా ఖ్యాతి చాటుకుంది.
ఫలితాలు ఇలా…
ఒకేషన్లో విభాగంలో..
యాదాద్రి వెనుకంజ
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా వెనుకబడింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. రాష్ట్ర స్థాయిలో యాదాద్రి జిల్లా స్థానం కింది నుంచి నమోదైంది. రెండు సంవత్సరాలు కలిపి 64.64 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. దీంతో అటు విద్యార్థులు.. ఇటు తల్లిదండ్రులు నిరాశలో ఉన్నారు. ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం సోమవారం నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫస్టియర్లో 32వ స్థానం..
ఇంటర్ రెండో సంవత్సరం జిల్లాలో 72.99 శాతం ఉత్తీర్ణతతో 16 స్థానం దక్కించుకుంది. మొత్తం 4457 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3253 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో సెకండియర్లో 69.11శాతంతో రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. 1324 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 915 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ ఫస్టియర్లో 60.33 శాతంతో రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. మొత్తం 5178 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3124 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ మొదటి సంవత్సరంలో 49.60 శాతంతో రాష్ట్రంలో 32వ స్థానానికి పరిమితమైంది. మొత్తం 1373 మంది విద్యార్థులకు గాను 681 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి సెకండియర్లో 51.46 శాతం ఉత్తీర్ణులయ్యారు.
బాలికలదే హవా..
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. అమ్మాయిలు మంచి ఫలితాలు సాధించారు. జనరల్ ఫస్టియర్లో అబ్బాయిలు 53.57 శాతం, బాలికలు 67.05 శాతంతో పాసయ్యారు. ఒకేషనల్లో బాలుర శాతం 35.21 కాగా, అమ్మాయిలు 65.79 శాతం పాసయ్యారు. జనరల్ రెండో సంవత్సరంలో బాలురు 65.83 శాతం కాగా, బాలికలు 79.47 శాతంతో రాణించారు. ఒకేషనల్లో అబ్బాయిలు 58.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 78.95 శాతం పాసయ్యారు.
పేటలో 69 శాతం
ప్రథమ సంవత్సర ఫలితాల్లో 15వ స్థానం
సూర్యాపేట అర్బన్ ఏప్రిల్ 12 : ఆదివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా అనుకున్నస్థాయిలో ఉత్తీర్ణత సాధించలేదు. జిల్లాలో హాజరై విద్యార్థుల్లో కేవలం 69 శాతం మంది మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన వారు ఫెయిలైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. మొదటి సంవత్సర ఫలితాల్లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 8184 మంది హాజరుకాగా 60.54 ఉత్తీర్ణతా శాతంలో 4,955 మందిపాసయ్యారు. రాష్ట్రంలో మొదటి సంవత్సర ఫలితాల్లో జిల్లా 15వ స్థానంతో సరిపెట్టుకుంది. సెకండియర్ ఫలితాల్లో జిల్లా స్థానం మరింత దిగజారింది. ద్వితీయ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 7468 మంది పరీక్షలకు హాజరుకాగా 5174 మంది పాసయ్యారు. దీంతో జిల్లా 69.28 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 23వ స్థానంలో నిలిచింది. జిల్లాలో బాలికలు 74.21 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు కేవలం 54.32శాతం ఉత్తీర్ణత సాధించి వెనుకంజలో ఉన్నారు.

Pp