– చండూరు ఏఓ మల్లేష్
చండూరు, జులై 02 : ప్రతి ఎకరాకు జియో టాగిoగ్ చేయనున్నట్లు చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ తెలిపారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ రైతు వేదిక నందు గురువారం గ్రామ సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించిన కాటన్ కపాస్ కాంతి పథకం కింద వచ్చిన పత్తి విత్తనాలను (అధిక సాంద్రత పత్తి) రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ.. ఈ పథకం కింద వచ్చిన విత్తనాలను రైతులు కచ్చితంగా విత్తుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే విత్తనాలు నాటిన రైతులు తీసుకోవడానికి అవకాశం లేదని, అధిక సాంద్రత పత్తి ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించి తమ ఆధార్ కార్డు, భూమి పాస్ పుస్తకం, రైతు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
ఒక్క రైతుకి/ కుటుంబానికి ఒక ఎకరానికి మాత్రమే విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని తర్వాత విత్తనాలు తీసుకున్న రైతుల పంట క్షేత్రాలలో అధికారుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. దీనికి జియో టాగింగ్ చేయడం జరుగుతుంది కావున రైతులు ఇది గమనించి కచ్చితంగా విత్తనాలు నాటుకునే రైతులు మాత్రమే తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భూతరాజు ఆంజనేయులు, తలారి నరసింహ, ధోనిపాముల, బోడంగిపర్తి సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.