కోదాడ రూరల్, మే 12 : ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ రూరల్ మండల పరిధి దోరకుంట గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులు, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను తుంగలో తొక్కి వాళ్లకు ఉరితాడుగా మారే నాలుగు చట్టాలను తీసుకు వస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కౌలుదార్ సంఘం నాయకులు షేక్ సైదా, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మిట్టకడుపు ముత్యాలు, దేవర వెంకట్రెడ్డి, అలసగాని బ్రహ్మయ్య, వేమా నారాయణ, జొన్నలగడ్డ వెంకటయ్య, శ్రీను పాల్గొన్నారు.