రామన్నపేట, జూన్ 25 : తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన రామన్నపేట మండలం కొమ్మయిగూడెం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మయిగూడెం గ్రామానికి చెందిన ఎర్ర తిరుమలేశ్ (41) గ్రామంలోని కాటమయ్య గుడి వద్ద తాటిచెట్టు ఎక్కి కల్లు తీసే క్రమంలో ఒక్కసారిగా జారి కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలైన తిరుమలేశ్ను చుట్టుపక్కల వారు గమనించి రామన్నపేట దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేశ్ గౌడ్ అన్నారు. ఆయన వెంట గంగాపురం వెంకటయ్య, బాలగోని మల్లయ్య, ఎర్ర భిక్షపతి ఉన్నారు.