తుంగతుర్తి, మార్చి 24 : తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కుమ్మరి వెంకన్న ఇటీవల మరణించడంతో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మండల పరిధిలోని గానుబండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు బత్తుల శివ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాముల గౌడ్, తడకమళ్ల రవికుమార్, గోపగాని రమేశ్, మల్లెపాక రాములు, గడ్డం సోమేశ్, జలంధర్, గునిగంటి సంతోష్, గుడిపాటి వీరయ్య, యాకూబ్, బొజ్జ సాయి కిరణ్, కొండగడుపుల వెంకటేశ్, గోపగాని వెంకన్న, రామనర్సు పాల్గొన్నారు.