CWG-2026 | కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ.. కూరగాయల వ్యాపారి కుమారుడికి కాంస్యం
CWG-2026 | కామన్వెల్త్ గేమ్స్-2026 (CWG-2026) లో భారత్ బోణీ కొట్టింది. పారా పవర్‌లిఫ్టర్ జండు కుమార్ (Jandu Kumar) దేశానికి తొలి పతకాన్ని అందించాడు. శనివారం రాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ కేటగిరీ పోటీల్లో కాంస్య (Bronze) పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 72.4 కిలోల బరువున్న జండు కుమార్ తన రెండో ప్రయత్నంలో 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.
CWG-2026 : కామన్వెల్త్ గేమ్స్-2026 (CWG-2026) లో భారత్ బోణీ కొట్టింది. పారా పవర్‌లిఫ్టర్ జండు కుమార్ (Jandu Kumar) దేశానికి తొలి పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన పురుషుల హెవీవెయిట్ కేటగిరీ పోటీల్లో కాంస్య (Bronze) పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 72.4 కిలోల బరువున్న జండు కుమార్ తన రెండో ప్రయత్నంలో 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మూడో ప్రయత్నంలో 196 కిలోలు ఎత్తడంలో స్వల్ప తేడాతో విఫలమయ్యాడు. పోటీల్లో చాలాసేపు ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరికి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
బీహార్‌లోని నలందా జిల్లా హర్నాత్ గ్రామానికి చెందిన జండు కుమార్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. ఓ సాధారణ కూరగాయల వ్యాపారి కుమారుడైన జండు.. పుట్టుకతోనే పోలియో బారినపడ్డాడు. అయినప్పటికీ ఎన్నో శారీరక, ఆర్థిక సవాళ్లను అధిగమించి అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలిచాడు. ఆసక్తికరంగా జండు క్రీడా జీవితం పవర్‌లిఫ్టింగ్‌తో మొదలుకాలేదు. 2017లో షాట్‌పుట్, డిస్కస్ త్రో అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించి జిల్లా, రాష్ట్ర స్థాయి పతకాలు కూడా సాధించాడు. జిమ్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుని ఆ తర్వాత ఈ క్రీడలోకి మారాడు.
అయితే అతని ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఉన్నతస్థాయి పోటీలకు అవసరమైన పోషకాహారం కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో జీవనోపాధి కోసం కూరగాయల వ్యాపారం నడిపారు. కనీసం వీల్‌చైర్ కూడా లేని స్థితిలో రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణించి స్థానిక మార్కెట్లకు వెళ్లేవాడు. స్నేహితుల వద్ద అప్పు చేసి కొన్న ఈ-రిక్షాతో చేసిన కూరగాయల వ్యాపారం కూడా అప్పట్లో కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్నది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పారాలింపిక్ కాంస్య పతక విజేత రాజిందర్ సింగ్ రహేలు.. జండులోని ప్రతిభను గుర్తించాడు. గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్లో శిక్షణకు ఆహ్వానించాడు. రాజిందర్ మార్గదర్శకత్వంలో జండు కుమార్ అద్భుతంగా రాటుదేలాడు. 2025 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 205 కిలోలు ఎత్తి జాతీయ రికార్డు సృష్టించాడు. కొద్ది నెలలకే ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో 206 కిలోలు ఎత్తి తన రికార్డును తానే బద్దలుకొట్టాడు.
ఈ కామన్వెల్త్ పతకానికి ముందు బీజింగ్ ప్రపంచకప్ (2025), ఆసియా ఛాంపియన్షిప్ (2026) లలోనూ కాంస్య పతకాలు గెలుచుకుని తన సత్తా చాటుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

