నల్లగొండ రూరల్, ఆగస్టు 20 : జి.చెన్నారం నుండి అనంతారం వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున అన్నారు. సిపిఎం నల్లగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జి.చెన్నారం గ్రామంలో రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై కనీసం నడవలేని స్థితి ఏర్పడిందని, రైతులు పండించిన పంటలను మార్కెట్కు తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గుంటలమయమై దిగబడిన ఈ రహదారి కారణంగా రాకపోకలు పూర్తిగా కష్ట సాధ్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే నిధులు మంజూరు చేసి రహదారిని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఉపాధి హామీ నిధుల నుండి అయినా రహదారిని నిర్మించాలని కోరారు. సమస్యను విస్మరిస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ కార్యదర్శి నలుపురాజు సైదులు, సభ్యులు కొండా వెంకన్న, కట్ట అంజయ్య, మానుపాటి ఎల్లయ్య, దర్శనం రాములు, మారగోని శేఖర్, నలబోతు సాంబయ్య, ముక్కామల పెద్దులు, దర్శనం రాములు, నలబోతు నాగరాజు, మారగోని అంజయ్య, ఉప్పునూతన వెంకులు, మైలపాక శ్రీను పాల్గొన్నారు.