నల్లగొండ జిల్లా జైలులో ఉచిత వైద్య శిబిరం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కారాగారంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని..
నీలగిరి, ఏప్రిల్ 04 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కారాగారంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కారాగారం పర్యవేక్షణ అధికారి కూన ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో ఖైదీలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా కారాగారం జైలర్ బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమన్వయంతో కీలక పాత్ర పోషించారు.
వైద్య శిబిరంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు డా.ఏసిహెచ్ పుల్లారావు, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా.రమేష్, డా.సుబ్బారావు, డా.వి.వినోద్ కుమార్, డా.శంకర్, డా.విశ్వజ్యోతి, డా.రామచంద్ర, డా.జి.ప్రవీణ్, డా.భరద్వాజ్, డా.వంశీ, డా.శ్రీవాస్తవ వైద్య సేవలు నిర్వహించారు. జిల్లా జైలు మెడికల్ ఆఫీసర్ సట్టు కిరణ్ కుమార్, డిప్యూటీ జైలర్లు వెంకట్ రెడ్డి, సుబ్బరాజు, మెడికల్ సిబ్బంది సీతారామ్, లింగయ్య, అలాగే పోలీసు సిబ్బంది సైదులు, గిరిబాబు, సురేష్, రాంబాబు, కరుణాకర్, శ్రావణ్, జయప్రకాష్ రెడ్డి, గణేశ్, శ్రీకాంత్, కోటి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

