కోదాడ రూరల్/ చింతలపాలెం, జూన్ 28: గంజాయి తాగినా, విక్రయించినా, రవా ణా చేసినా కఠిన చర్యలు తప్పవని కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం కోదాడ రూరల్ సర్కి ల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ గంజాయి తాగుతూ పట్టుబడిన నలుగురు నిందితుల వివరాలను వెల్లడించారు. స్నేహితులైన చింతలపాలెం మండలం దొండపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగార్జున, నంబూరి రత్నాకర్‌రెడ్డి, వేముల నాగరాజు, కేతవరపు సాయి, గాంధీనగర్‌కు చెందిన ముడావత్ అశోక్ గంజాయికి బానిసలుగా మారారన్నారు.
ఈనెల 21న అశోక్, సాయిలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో గుర్తు తెలియని వ్యక్తి నుంచి 5 కేజీల గంజాయి ని రూ.12వేల ఐదు వందలకు కొనుగోలు చేశారు. తిరిగి దొండపాడు గ్రామానికి వచ్చిన వీరు బొడ్డు బసవయ్య కాలనీకి చెందిన మధిర లక్ష్మారెడ్డి ఇంటి వెనుక ఉన్న ఓ గాబు కింద గంజాయిని దాచారు.
శనివారం పంచుకునేందుకు వారు అక్కడకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 2.784 కేజీల గంజాయిని, ఓ స్కూటి, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు పరారీలో ఉన్న ట్లు తెలిపారు. గంజాయి నిర్మూలనలో భాగంగా చేపట్టిన ఈ స్పెషల్ టాస్క్‌లో కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, చింతలపాలెం ఎస్సై సందీప్, హెడ్‌కానిస్టేబుల్ లింగరాజు, భాస్కర్, అమృతయ్య, కవిరాజు ఉన్నారు.