నల్లగొండ, మే 08 : ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు గాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన నలుగురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారం సస్పెండ్ చేశారు. నల్లగొండ మండలం పెద్ద సూరారం, నార్కెట్పల్లి మండలం బాచకుంట, త్రిపురారం అలాగే చండూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంటర్ చేయలేదు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కేంద్రాలకు చెందిన నలుగురు పీఏసీఎస్ ఇన్చార్జిలను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.