దేవరకొండ రూరల్, జూన్ 12 : దేవరకొండ మండలంలోని సూర్యాతండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే బాన్య బావోజితాండాలో ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్ఓ వాటర్ ప్లాంట్ను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు ఒక సైనికునిలా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సూర్యాతండలో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభిచారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య, ఎంపీడీఓ డానియల్, హౌసింగ్ డీఈ నాగేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ సర్పంచులు నారాయణ, నర్య నాయక్, శివయ్య, జగన్, లచ్చిరామ్, యాదయ్య, మీడియా & కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ నర్ర బాలు, పంచాయతీ కార్యదర్శి పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Devarakonda Rural : సూర్యాతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన