చండూరు, ఆగస్టు 28 : చండూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిన ప్రెస్ క్లబ్ భవన పునర్నిర్మాణానికి ఈవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమావేశాలకు, బాధిత ప్రజల సమస్యల నివేదనకు ప్రెస్ క్లబ్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారితో కలిపి నేడు రెండంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.
అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవడానికి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. భవన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి అప్పగించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కావాల్సిన మౌలిక సదుపాయాలను సైతం సమకూర్చనున్నట్లు పేర్కొన్ఆరు. ఈ కార్యక్రమంలో చండూరు మండల పత్రికా విలేకరులు, మునుగోడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులు పాల్గొన్నారు.
Chandur : చండూరు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన