మునుగోడు రూరల్, జనవరి 7: మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని గూడపూర్, కల్వలపల్లి, పులిపలుపుల, బీరెల్లి గూడెం, జమస్తాన్‌పల్లి, గుండ్లోరిగూడెం గ్రామాల్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.1.20 లక్షలు, ఉపాధి హామీ నిధులు రూ.2 కోట్లతో సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల్లో ప్రజలు స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఈ ప్రాంతం వాడు కాదు కాబట్టి ఏ గ్రామం ఎకడ ఉందో కూడా తెలియదని, ఏనాడూ గ్రామాల్లో పర్యటించలేదని విమర్శించారు. ఆయన కాంట్రాక్టులే తప్ప ఏ రో జు కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. అనంతరం గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేపిస్తానని హామీ ఇచ్చారు.
క్యాంప్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన
మునుగోడు : మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న క్యాంప్ కార్యాలయం పనులను ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి శనివారం పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ పనులు త్వరగా కార్యాలయాన్ని అప్పగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భవనానికి సంబంధించి పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
మండలకేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి గతంలో కేటాయించిన భూమి కొన్నేండ్లుగా వివాదంలో ఉండగా ఈ విషయం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా భూమికి సంబంధించిన యజమానులు,అయ్యప్ప సేవా సంఘం సభ్యులను పిలిపించి ఇరువర్గాలకు సర్ధిచెప్పి ఆలయ నిర్మాణానికి 14 గుంటల భూమి ఇచ్చే విధంగా భూమి యజమానిని ఒప్పించారు. అలాగే ఆలయ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో అయ్యప్పసేవా సంఘం సభ్యు లు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, ఎంపీడీఓ జానయ్య, డీఈ రఘుపతి, ఏఈ రామకృష్ణ, సర్పంచులు కంచి జ్యోతీప్రసాద్, పందుల మారయ్య, పంతంగి పద్మాస్వామి, పల్లెగోని యాదయ్య, ఎంపీటీసీలు వెంకటమ్మ వెంకన్న, బొల్గూరి లింగయ్య,పోలగోని విజయలక్ష్మీసైదులు, ఈద నిర్మలాశరత్ బాబు, బొడ్డు శ్రావణీనాగరాజు గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్, ఉప సర్పంచులు జంగిలి సాంబయ్య, యంపల్ల సరిత, నాయకులు మల్లేశ్, ఖమ్మంపాటి సైదులు, ముంత మారేశ్, సింగం నరసింహ, లిం గస్వామి, బీఆర్ఎస్ నాయకులు పోలగోని సైదులుగౌడ్, నన్నూరి భూపతిరెడ్డి, దోటి కర్ణాకర్, జంగిలి నాగరాజు, బొల్గూరి సైదులు, కృష్ణ, హేమలత, మమత, శైలజ, శివ, విష్ణు అయ్యప్ప ఆలయ భూదాత కమ్మంపాటి కిరణ్‌కుమార్, అరుణ్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు పాలకూరి నర్సింహాగౌడ్, అయ్యప్పసేవా సంఘం అధ్యక్షుడు బొడ్డునాగరాజుగౌడ్, మాలధారులు పాల్గొన్నారు.