పెద్దఅడిశర్లపల్లి, జూన్ 23 : కార్పొరేట్ చదువుల కోసం పట్టణాలకు పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని భావించి మాజీ మహిళా సర్పంచ్ తన తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ తోటకూరి పావని పరమేశ తన ఇద్దరు చిన్నారులు వేదాంత్ యాదవ్ (1వ తరగతి), లాస్య(3వ తరగతి) లో చేర్పించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుడడంతో ఇతరులకు అదర్శంగా ఉండేలా ఇటీవల నిర్వహించిన జయశంకర్ బడిబాటలో భాగంగా అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఆమె తన పిల్లలిద్దరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మిగతా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా కోరారు. సోమవారం పాఠశాలలో ఇద్దరు చిన్నారులకు అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైనం సంధ్య, ప్రధానోపాధ్యాయులు మైనం ఉమాశంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.