‘మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వారికే ఇవ్వాలి’
రాష్ట్రంలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వారికే ఇవ్వాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గతంలో పనిచేసిన పెండింగ్ బిల్లుల విషయంలో పాత సర్పంచులను...
– బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్
దామరచర్ల, మే 15 : రాష్ట్రంలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వారికే ఇవ్వాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గతంలో పనిచేసిన పెండింగ్ బిల్లుల విషయంలో పాత సర్పంచులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మాజీ సర్పంచులు ఆయా గ్రామ పంచాయతీల్లో సొంత డబ్బులు, అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయించగా నిధులు రాకపోవడంతో ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయగా పాత పనుల బిల్లులు ఇవ్వకుండా మాజీ సర్పంచులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలో బిల్లులకు కమీషన్లు అడుగుతున్నారని, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని పాత పాలకవర్గాలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

