యాదగిరిగుట్ట, ఏప్రిల్10 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఆలేరు నియోజకవర్గం నుంచి 15 వేల మంది పార్టీ శ్రేణులు, అభిమానులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరి గుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో గురువారం బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవాన్ని జయప్రదం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని అన్నారు.
సభ అనంతరం ఆన్లైన్ సభ్యత్వ నమోదుకు కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. 2014లో పాలన పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని అన్నారు. ఆరు గ్యారంటీలంటూ ఊదరగొట్టి 16 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అటకెక్కించిందని విమర్శించారు. మహిళలకు రూ. 2,500, పింఛన్ల పెంపు, తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటీలు వంటి పథకాలు ఎటుపోయాయాని అన్నారు.
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును చేరిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి బీమగాని నర్సింహగౌడ్, మాజీ కౌన్సిలర్ ఆవుల సాయి.
పట్టణ అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్‌రెడ్డి, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడె మహేందర్, నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, కోన్యాల నర్సింహారెడ్డి, అంకం నర్సింహ, మాటూరి బాలయ్య, ఆరె స్వామి, చిత్తర్ల బాలయ్య, శిఖ శ్రీనివాస్, గుణగంటి బాబురావు, పేరబోయిన సత్యనారాయణ, శారాజీ రాజేశ్ యాదవ్, గడ్డం చంద్రం తదితరులు పాల్గొన్నారు.