తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి,
రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, బీఆర్ఎస్ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, నిమ్మల శ్రీనివాస్, గుజ్జ యుగేంధర్‌రావు, బోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.