చందంపేట (దేవరకొండ) 15 : ఇటీవల ప్రమాదానికి గురై శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయన వేంట పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, బీఆర్ఎస్ పీఏపల్లి మండలాధ్యక్షుడు వెల్లుగురి వల్లపురెడ్డి, అర్వపల్లి నర్సింహ్మ, సంకు, కొండల్‌రెడ్డి, బొడ్డుపల్లి మహేందర్, గొలి గిరి ఉన్నారు.