ప్రజా వేదికపై ప్రతినిధిని అవమానించడం దుర్మార్గం
ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదికపై జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవమానపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
భువనగిరి అర్బన్, జనవరి 29 : ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదికపై జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవమానపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వేదికపై వాగ్వాదాలు జరుగడం వల్ల ప్రజా ప్రతినిధులపై జనం నమ్మకం కోల్పోతారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
అనుచిత వ్యాఖ్యలు తగవు : కంచర్ల రామకృష్ణారెడ్డి
ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీలను, నాయకత్వాన్ని కించపరచడం, దూషించడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదైనా ఉంటే తమ పార్టీ సమావేశంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా వాఖ్యానించడం సరికాదని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ను 100 అడుగుల లోతులో గోతి తీసి పెడుతా, కొన ఊపిరితో పాతిపెడుతా, కేటీఆర్ కాలిగోటికి సరిపోడనడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులే అయ్యిందని, అప్పుడే సహనం కోల్పోయి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్షంగా నిలబడి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో డిసెంబర్ 9 నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దని, బ్యాంకులకు వెళ్లి రూ.2లక్షలు తీసుకుంటే వెంటనే మాఫీ చేస్తామని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల పొట్టగొట్టారని, ఇప్పటికి 26 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో 33 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ వారే ఉన్నారని, దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, జడ్పీటీసీ బీరు మల్లయ్య, బీబీనగర్ పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

