హాలియా, జూన్ 25: కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని, ఆ పార్టీని బొం దపెడితేనే రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. గురువా రం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలం చెం దిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన చూసి రాష్ట్రంలో ప్రజలు రచ్చబండల వద్ద నవ్వుకుంటున్నారని తెలిపారు. గత శాసన సభ ఎన్నికల్లోప్రజలకు ఇచ్చిన అన్ని హామీలకు అమలుచేయడంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందన్నారు.
ప్రభుత్వం రైతుభరోసా సంబరాలు నిర్వహిండం హాస్యాస్పదమని, దేని కోసం రైతు భరోసా సంబురాలు నిర్వహిస్తుందో స్పష్టం చేయాలన్నారు. మూడు కార్ల నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధు లు జమ చేయనందుకా, లేక ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఎకరాకు 12వేలు ఇచ్చి రైతులను మోసం చేసినందుకా ఎందుకు సంబురాలు నిర్వహిస్తుందో స్పష్టం చేయాలని కోరారు.
కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేకి, దగాకోరు ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు ఉండవని ఎద్దేవా చేశారు. త్వరలో స్ధానికి సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభు త్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందే తప్ప రైతులపై కానీ, రైతు సంక్షేమంపై కానీ వారికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ వారికే కూకుండా నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే జానారెడ్డినే నేటికీ ప్రజలు ఎమ్మెల్యేగా భావిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులనే..ప్రస్తుత ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప, నియోజకవర్గానికి తీసుకువచ్చిన నిధులు లేమీలేని నోముల భగత్‌కుమార్ పేర్కొన్నారు. సమావేశంలో కురాకుల వెంకటేశ్వర్లు, రవినాయక్, పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, అనుముల శ్రీనివాసరెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, కామర్ల జానయ్య, వడ్డే సతీశ్‌రెడ్డి, గుండెబోయిన వెంకన్న, నల్గొండ సుధాకర్, ఉర్లగొండ వెంకటయ్య, పోదిల శ్రీనివాస్, సురబి రాంబాబు, మెరుగు రామలింగయ్య, మెండే సైదులు, సైదాచారి, మాతంగి కాశయ్య, దుర్గారావు. తదితరులున్నారు.