నీలగిరి, డిసెంబర్ 24 : నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మృతి చెందగా, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలు నివాళులర్పించారు. గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డితోపాటు మాజీ ఎంపీ బడుగుల, మాజీ ఎమ్మెల్యేలు మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం నేరేళ్లపల్లి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్లి జనార్ధన్‌రెడ్డిని పరామర్శించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బోనగిరి దేవేందర్ ఉన్నారు.