రానున్న రోజుల్లో మునుగోడు ఎడారే!
సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారనుందని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం చండూరులో సాగునీటి ప్రాజెక్టు మీద ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు.
- నియెజకవర్గానికి పట్టిన దరిద్రం ఎమ్మెల్యే
- మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు,మార్చి 29: సాగునీరు అందక రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారనుందని మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం చండూరులో సాగునీటి ప్రాజెక్టు మీద ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గానికి సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు అందుతోందని, ఇతర ప్రాజెక్టుల ద్వారా కానీ, కాల్వల ద్వారాకానీ మునుగోడుకు సాగునీరు రాదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా పూడిక తీయ డంతో చెరువులు నిండి భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంటలు పడించుకున్నారన్నారు. మునుగోడును సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ శివన్న గూడెం,లక్ష్మణాపురం ప్రాజెక్టు పనులను దాదాపు 90 శాతం పూర్తి చేశారన్నారు. ఎదుళ్ల నుంచి మునుగోడుకు వచ్చే నీటి పంపకాల్లో 436 అడుగుల నుంచి నీరు రావాల్సి ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వం 440 అడుగులు చేసిందన్నారు. దీంతో మునుగోడుకు చుక్క నీరు రాదన్నారు. మునుగోడుకు నీళ్లు రానప్పుడు వేల కోట్లతో నిర్మించిన శివన్న గూడెం ప్రాజెక్టు ఆగమ్యగోచరంగా మారుతుందన్నారు. ము నుగోడుకు వచ్చే 0.5 టీఎంసీలకు 436 మీటర్ల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పిచ్చోడి చేతిలో రాయి..
మునుగోడుకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలా మునుగోడు పరిస్థితి తయారైందన్నారు. మంత్రి పద వి కోసం ఎమ్మెల్యే మునుగోడు ప్రజల జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టును పణంగా పెట్టి ఏడారిలా మార్చాలని చూస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేశారు. పొద్దున్న లేస్తే మునుగోడు అ భివృద్ధికి నోచుకోలేదని అంటున్నాడ ని, ఆయనను 5 సంవత్సరాలు ఎంపీగా, 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా,4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మళ్లీ ఇప్పుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఏం చేశాడో ఆ త్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికా రు. రాజగోపాల్ మునుగోడు ఎమ్మెల్యే కావ డం నియోజకవర్గ ప్రజల దరిద్రమన్నారు.
ఉ ప ఎన్నికలో గెలిచిన తాను కేసీఆర్ ఆశ్వీదం తో మునుగోడుకు రూ.570 కోట్ల నిధులు, రెవెన్యూ డివిజన్,100 పడకల దవాఖాన, సమీకృత మార్కెట్, మండల కేంద్రంగా గట్టుప్పల్‌ను చేయడమే కాకుండా చిన్న గ్రామాల ను పంచాయతీలు చేశానన్నారు. ఎదుళ్ల వద్ద అలైన్మెంట్ మార్చకుంటే ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాల్వకు ఎలా అ న్యాయం జరుగుతుందో మునుగోడుకూ అలా అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న,కొత్తపాటి సతీష్,మాజీ ఎంపీ పీ తోకల వెంకన్న,అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్,యువజన అధ్యక్షుడు ఉజ్జిని అనిల్‌రావు, కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి,సామ సుజాత,కొండ్రెడ్డి మధు, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్, రెండో వార్డు అధ్యక్షులు ఎండీ గౌస్, మూడో వార్డు అధ్యక్షుడు చొప్పరి దశరథ యాదవ్, నాలుగో వార్డు ఇరిగి రామకృష్ణ,ఇరిగి గురునాథం,ఇరిగి రామన్న,తాడిశెట్టి సంతోష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

