ఎన్నికల్లో గెలుపోటములు సహజం
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్యాయి స్రవంతిరెడ్డితో కలిసి చండూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు, డిసెంబర్ 24 : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్యాయి స్రవంతిరెడ్డితో కలిసి చండూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని, హామీలు నెరవేర్చకపోతే నిలదీద్దామని, అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే రూ.572 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2018లో గెలిచిన రాజగోపాల్‌రెడ్డి అధికారం లేకపోవడం వల్ల పనులు చేయలేకపోయానని సాకులు చెప్పారని, ఇప్పుడు నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేస్తాడో చూద్దామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో పని చేయాలని, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, బీఆర్ఎస్ చండూరు, గట్టుప్పల్ మండలాల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, ఇడెం కైలాసం, పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

