న్యూఢిల్లీ, ఆగస్టు 18: న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత గోవాలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ వందేమాతరం గేయాలాపనకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న తరుణంలో పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖలైన ఫిర్యాదులోని ప్రాతిపదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రశ్నించారు.
జాతీయ గేయాన్ని దాని పూర్వ రూపంలో పాడటం నేరమైతే మహాత్మా గాంధీతోపాటు మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయిలపై కూడా ఫిర్యాదులు నమోదు చేయాలని ఆయన సవాలు విసిరారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ గేయాన్ని పూర్తి స్థాయిలో ఆలపించడాన్ని ఆపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ సంకేతాలు ఇచ్చారని ఆరోపిస్తూ బీజేపీ ఆమెపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.