ఎన్నికల హామీలను నెరవేర్చే వరకూ వెంట పడతాం
భూగర్భజలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంట పొలాలను పరిశీలిస్తుంటే, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు.
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
చండూరు, ఏప్రిల్ 6 : భూగర్భజలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంట పొలాలను పరిశీలిస్తుంటే, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం చండూరులో చేపట్టిన రైతు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి ఒకటి, రెండు పథకాలు అమలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు.
పంటలు ఎండిన రైతులకు ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి రూ.500బోనస్‌తోపాటు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసేవరకు వెంట పడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, కేసీఆర్ అన్నివిధాల అండగా ఉంటారని తెలిపారు.
కార్యక్రమంలో గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, రైతుసేవా సహకార సంఘం చైర్పర్సన్ కోడి సుష్మావెంకన్న, సీనియర్ నాయకలు మునగాల నారాయణరావు, వైస్ ఎంపీపీ అవ్వారీ గీతాశ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు భూతరాజు దశరథ, యూత్ అధ్యక్షడు ఉజ్జిని అనిల్‌రావు, మండల ఉపాధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, కౌన్సిలర్ మంచుకొండ కీర్తిసంజయ్, మాజీ మండలాధ్యక్షడు పెద్దగొని వెంకన్నగౌడ్, తేలుకుంట్ల జానయ్య, పల్లె వెంకటయ్య, ఇరిగి రామన్న, కట్ట అం జయ్య, పల్లె నాగార్జున, స్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

