నల్లగొండ, ఏప్రిల్ 6 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు ప్రకటించిన క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌తోపాటు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపచేసి కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేలు ఇవ్వాలని నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కకు పెట్టి మొద్దు నిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు రైతుదీక్ష చేపట్టామన్నారు.
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయినప్పటికీ కనీసం వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించకపోవటం దారుణమన్నారు. కరెంటు, నీళ్లు లేక పంట పొలాలు ఎండితే కనీసం ఎండిన పొలాలను చూసేందుకు మంత్రులకు తీరిక లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వటానికి చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని, కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని విమర్శించారు.
కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తికెకాయన్న కంచర్ల.. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమన్న కోమటిరెడ్డికి రైతులే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప.. ఎండలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తారాన్నారు. కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీంపాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు బక పిచ్చయ్య, కొండూరి సత్యనారాయణ, బకరం వెంకన్న,
కాంచనపల్లి రవీందర్రావు, ప్రముఖ కవి గాయకుడు చింతల యాదగిరి, కౌన్సిలర్లు యామా కవితాదయాకర్, మారగోని గణేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు, కనగల్, నల్లగొండ, తిప్పర్తి మండలాధ్యక్షులు అయితగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నంరాజు, తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్ చైర్మన్లు తవిటి కృష్ణ, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, దొంతం ఇంద్రసేనారెడ్డి, వనపర్తి జ్యోతి, కొప్పు విమలమ్మ, మర్రి రేణుక, కంచర్ల విజయ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.