రాజాపేట, జూలై 13: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని, సాముల సరార్కు ముగింపు పలికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే సీముల సరార్ మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రాజాపేటలోని మీనాక్షీ ఫంక్షన్ హాలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా చూడాలని, ఎవరి ఓటు గల్లం తు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రెండు చోట్ల ఓటు నమోదు చేసుకుంటే ఎన్నికల అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకా శం ఉందని ఒకే చోట ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందనే పూర్తి విశ్వా సం తమకు ఉందని సునీతా మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, నల్లగొండ రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ డైరెక్టర్ సం ధిల భాసర్ గౌడ్, నాయకుల గుంటి మధుసూదన్ రెడ్డి, పల్లె సంతోష్ గౌడ్, ఎర్రోకుల జస్వంత్, గుర్రం నరసింహులు, రెడ్డబోయిన రాజు, గంధ మల్ల సురేశ్, బిళ్లుకుదురు రాజు, కర్ల కరుణాకర్ రెడ్డి, నాగీర్తి గోపి రెడ్డి, సోమలింగం గుప్తా తదితరులు పాల్గొన్నారు.
సర్ పూర్తయ్యేలా కృషి చేయాలి
తురపల్లి, జూలై 13 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ గ్రామాల్లో వంద శాంతం పూర్తయ్యేలా బీఎల్ఏలు కృషి చేయాలని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గొంగడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లిలో సోమవారం బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం లో ఆమె మాట్లాడారు. బీఎల్ఏలు గ్రామాల్లో ఇల్లిల్లూ తిరిగి ఇంకా ఫారాలు నింపని వారిని గుర్తించి వాటిని నింపడంలో సహకరించి బీఎల్వోలకు అందజేయాలన్నారు. ఈనెల 20 లోగా వందశాతం సర్ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చా రు. ఓటర్లకు అందుబాటులో ఉంటూ సర్ ప్రక్రియలో పూర్తి సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, సర్పంచ్లు సీతరాజు, మోతీరాం, మాజీ సర్పంచులు పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ నల్ల శ్రీకాంత్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.