నకిరేకల్, సెప్టెంబర్ 2 : ఆవిర్భావం నాటి నుంచి బీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రక్త సం బంధీకులైనా, పార్టీ నాయకులైనా ఒక్కటేనని, కవిత సస్పెన్షన్‌పై యావత్ తెలంగాణలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం నకిరేకల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, చేపడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగే విధంగా ఉన్నాయి.
అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని, పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాయకులు, కార్యకర్తలు హర్షిస్తున్నారన్నా రు. బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే కవిత చేస్తూ వస్తోందన్నారు. కవిత వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. కవి త సస్పెన్షన్‌తో పార్టీకి నష్టం లేదన్నారు. మరోసారి కేసీఆర్ సీఎం కావాలని యావ త్ తెలంగాణ ప్రజలు భావిస్తున్న తరుణం లో కవిత అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జోడెడ్ల మాదిరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మం త్రి హరీశ్‌రావు ఇరవై నెలలుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అవిశ్రాంతంగా పో రాడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తులపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కుటుంబంలో ఏమైనా సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలే తప్ప, ఇలా బహిర్గతంగా మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ అందరినీ ఒకే విధంగా చూస్తారని పేర్కొన్నారు.