కాంగ్రెస్ హయాంలో .. పెరిగిన దళారీ వ్యవస్థ!
నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరుతో సొసైటీలు ఏర్పాటు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవా రం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.
- కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరుతో నిలువు దోపిడీ
- మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, ఏప్రిల్ 13: నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరుతో సొసైటీలు ఏర్పాటు చేసి రైతులను దోపిడీ చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవా రం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నల్లగొండ జిల్లా వ్యవసాయాభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానం, తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, ధాన్యం కొనుగోలు, సాగునీటి వసతుల కల్పనతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని, మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని జనం కోరుకుంటున్నారన్నారు. రెండున్న రేం డ్లలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, కేంద్రాలపై సీఎం, మంత్రుల కు పట్టింపులేకుండా పోయిందన్నారు.
నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే వీరేశం సొంత మనుషులను పెట్టి, చత్తీస్ఘడ్, విజయవాడ నుంచి తీసుకొచ్చిన ధాన్యం రాత్రికి రాత్రే కాంటాలు వేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల నిర్వాహకులు క్వింటాల్‌కు 10 కేజీల తరుగు తీస్తూ రైతుల ను మోసగిస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లు, అధికారులు కుమ్మకై మిల్లులు మూసివేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దళారి వ్యవస్థ పెరిగిపోవడంతో రైతులకు తీవ్ర అన్యా యం జరుగుతోందని, తమ ధాన్యం అమ్ముకునేందుకు రూ.5 నుంచి 10 వేల వరకు నిర్వాహకులకు లంచాలు ఇచ్చి కాంటా వే యించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ప్రశ్నించిన రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా వేధిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, పెద్ది బాలనర్సయ్యగౌడ్, పెద్ది మల్లేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

