కట్టంగూర్, ఏప్రిల్ 18 : కట్టంగూర్ మండలంలోని మునుకుట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం పార్టీ నాయకులతో కలిసి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, నాయకులు పెద్ది బాలనర్సయ్య, బీరెల్లి ప్రసాద్, వడ్డె సైదిరెడ్డి ఉన్నారు.