నార్కట్‌పల్లి జూలై 14 :పార్టీలకు అతీతంగా నిర్వహించాల్సిన చేనేత సహకార సంఘ ఎన్నికల్లో పోలీసులు నియంతృత్వ వైఖరి అవలంబించి ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మాండ్ర గ్రామంలో జరిగిన చేనేత సహకార సంఘంఎన్నికల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు.
గ్రామంలో చేనేత సహకార ఎన్నిక ప్రక్రియ ఒక తంతులా జరిగిందని సీఐ, ఎస్సై అందుకు నిదర్శనమని బ్యాలెట్ పత్రాలను కూడా చూపించకుండా వృద్ధుల ఓట్లను పోలీసులే వేసి, కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేశారన్నారు. చేనే త కార్మికుల సంక్షేమం కోసం జరిగే సహకార ఎన్నికల్లో తమ ఆధిపత్యం కోసం రిటర్నింగ్ అధికారులను బెదిరించినట్లు తెలిపారు. పోలీసులు ఉదయం నుంచి సాయం త్రం వరకు కాంగ్రెస్‌కు కొమ్ముకాశారన్నారు.
కౌంటింగ్ వద్ద కూడా కాంగ్రెస్ ఏజెంట్లను మాత్రమే ఉంచి, మిగతా పార్టీల ఏజెంట్లను బయటకు పంపి రిటర్నింగ్ అధికారులు కాంగ్రెస్ గెలిచిందంటూ ప్రచారం చేశారన్నారు. ఇలాంటి సొసైటీ ఎన్నికల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అన్నారు. ఏది ఏమైనప్పటికీ మాండ్రలో బీఆర్ఎస్ నైతిక విజయం సాధించిందన్నారు. జిల్లా కలెక్టర్, సహకార సం ఘ కమిషనర్ మాండ్ర ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ భర్త బద్దుల రమేశ్‌ను పోలీసులు విపరీతంగా కొట్టారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లెబోయిన సైదు లు, పద్మశాలీ సంఘం నాయకుల వనం నరేశ్, మిరియాల నరసింహ, పున్న సత్యనారాయణ, పున్న నర్సింహ, శ్రీనివాస్, ధనుంజయ్య, నాగ య్య, ఏపూరి నరసింహ, వనం లక్ష్మయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.