చండూరు, నవంబర్ 20 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 89వ జయంతి వేడుకలు గురువారం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామంలో అయన కుటుంబ సభ్యులు పాల్వాయి శ్రవణ్ కుమార్ రెడ్డి, శంతన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అవినీతి మారకలేని నేతగా, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి, తెలంగాణ సాధన తొలిదశ నుండి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి విశేష కృషి చేసినట్లు కొనియాడారు. అనంతరం గ్రామ ప్రజలకు, ఆయన అభిమానులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో గోపిడి మాధవరెడ్డి, సుభాష్ రెడ్డి, ఇరిగి మారయ్య, లక్ష్మీపతి, బోయపల్లి స్వామి, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Chandur : ఘనంగా మాజీ మంత్రి పాల్వాయి జయంతి