నిడమనూరు, ఫిబ్రవరి 20 : హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు, వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మన్ కేవీ రామారావును మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి గురువారం ఆయన ఆసుపత్రికి వెళ్లారు.
రామారావుతోపాటు మాట్లాడడంతోపాటు వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య బృందాన్ని కోరారు.