చివ్వెంల, డిసెంబర్ 26 : చివ్వెంల మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో శుక్రవారం పలువురు మృతిచెందగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మృతదేహాలను సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చివ్వెంల మండల కేంద్రంలో కరెంట్ షాక్‌తో మృతి చెందిన మాదాసు బుచ్చయ్య, చిన్న కుమారుడు మాదాసు లోకేశ్ మృతదేహాలకు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో జగదీశ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే గుంపుల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన నాతాల నారాయణమ్మ మృతదేహానికి, అదేవిదంగా లక్ష్మినాయక్ తండాలో అనారోగ్యంతో మృతి చెందిన బానోత్ లక్ష్మణ్ నాయక్ మృతదేహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.