శాలిగౌరారం, డిసెంబర్ 17 : శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పీఏసీఎస్ వైస్ చైర్మన్ చామల మహేందర్ రెడ్డి సతీమణి అరుణ ఇటీవల మృతి చెందారు. బుధవారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ గ్రామానికి చేరుకుని అరుణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహేందర్ రెడ్డిని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కన్మత్ రెడ్డి శశిధర్ రెడ్డి, మండల నాయకులు చాడ హతీశ్ రెడ్డి, కట్ట వెంకట్రెడ్డి, గుండ శ్రీనివాస్, మామిడి సర్వయ్య, దుబ్బ వెంకన్న పాల్గొన్నారు.