నల్లగొండ రూరల్, జూన్ 25 : నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, ఐబీసీ చానెల్ రిపోర్టర్ పాలకూరి శేఖర్ గౌడ్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి అన్నెపర్తిలోని శేఖర్ గౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సందర్భంగా వారు శేఖర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం బీఆర్ఏస్ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
శేఖర్ గౌడ్ కుమార్తెలతో మాట్లాడి వారు ఏం చదువుతున్నదీ..వారి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలోనూ శేఖర్ గౌడ్ చురుకుగా పాల్గొన్నాడని గుర్తు చేసుకున్నారు. వారి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, ఏచూరి భాస్కర్, కార్పొరేటర్లు దొడ్డి రమేశ్, మారగోని భవానీగణేశ్, సర్పంచ్ మేకల పల్లవీఅరవింద్రెడ్డి, ఉప సర్పంచ్ శైలజానాగరాజు, మాజీ ఎంపీటీసీ పొగాకు ఘట్టయ్య, కమ్మపాటి వెంకన్న, మామిడి లింగస్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.