స్వరాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వచ్చిందని, అన్ని మతాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం నల్లగొండలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాశుపత హోమం, యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య పాలనలో ఆందోళనలు, ఆకలిచావులు, కరువు కాటకాలు ఉండేవని, స్వరాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెంది ప్రశాంత వాతావరణ నెలకొన్నదన్నారు. నాడు శిథిలావస్థకు చేరిన ఆలయాలు కొత్త రూపు సంతరించుకున్నాయని.. ధూప, దీప, నైవేద్య పథకంతో అర్చకులకు భరోసా కల్పించారని తెలిపారు. గంగ, జమున తెహజీబ్ అన్న గాంధీ మాటలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. అనంతరం జిల్లాలో కొత్తగా 26 ఆలయాలు ధూప, దీప నైవేద్య పథకానికి ఎంపిక కాగా, అర్చకులకు మంజూరు పత్రాలను మంత్రి అందించారు.
రామగిరి, జూన్ 21: స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్.. తెలంగాణలో అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి పాలన సాగిస్తున్న దార్శనికుడు ఆయనే.. అన్ని మతాలతు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న ఘనత ఆయనకే దక్కిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని పానగల్లో గల ఛాయా సోమేశ్వరాలయంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఛాయా సోమేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు చేశారు. వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన ఉత్సవాలను మంత్రి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. అనంతరం పాశుపత హోమం, యాగంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 2014కు ముందు రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఉండేవన్నారు.
ఆనాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు కూడా జీర్ణావస్థకు చేరాయని, కనీసం ధూప, దీపం లేక భక్తుల దైవ దర్శనం కరువైందన్నారు. ఆందోళనలు, ఆకలిచావులు, కరువు కాటకాలను ఎదుర్నొన్న ప్రాంతం మనదేన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక దేవాలయాల స్థితిగతులు మారాలి, ఆధ్యాత్మికత పెంపొందాలి, ప్రజలు బాగుండాలని భావించిన సీఎం కేసీఆర్ వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చారన్నారు. ఇతర మతాచారాలను, సంప్రదాయాలను కూడ గౌరవించి అందరూ కలిసి పండుగలు జురుపుకొనే పరిస్థితి నెలకొల్పారన్నారు. ధూప, దీప నైవేథ్య పథకం ద్వారా ఆలయాలకు నిధులు అందించడంతో పాటు అర్చకులకు వేతనాలను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత పెంపొందేలా చేపట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం నేడు ప్రపంచ దేశాల్లో కీర్తింప బడడంతో పాటు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిందన్నారు. ఒప్పుడు కరువు, కాటకాలతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో దేశానికి అన్నం పెట్టె స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఆశీర్వచనాలు, ఆశీస్సులు అందిస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి దేవాయల నిర్మాణం చరిత్రలో నిలిచి పోతుందన్నారు. పురష్కరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఛాయా సోమేశ్వరాలనికి రూ. 4కోట్లు కేటాయించడంతో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సర్వాంగ సుందరంగా తయారైందన్నారు.
నల్లగొండ నియోజకవర్గంలో 26 దేవాయాలు ధూప, దీప నైవేథ్య పథకం కింద కొత్తగా ఎంపిక కాగా వీటిలో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలకు సంబంధించిన ఉత్తర్వులను మంత్రి, ఎమ్మెల్యే అందించారు. వేద పాఠశాల, బ్రాహ్మణ అపరకర్మలకు కేటాయించిన స్థలం ఉత్తర్వులను నిర్వాహకులకు అందించారు.
ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సంస్కృతి, సంద్రాయ నృత్యాలు అలరించారు. మహిళాలు, చిన్నారుల కోలాట ప్రదర్శన, చెక్క భజన, చిన్నకాపర్తి సౌమ్య పాఠశాల చిన్నారులు వేసిన యోగాసనాలు, నల్లగొండ న్యూస్ పాఠశాల విద్యార్థుల నృత్యాలు, కోలాట ప్రదర్శన ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్‌యాదవ్, మున్సిపాల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.మహేందర్‌కుమార్, సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అధికారులు సంతోశ్‌రెడ్డి, జ్యోతి, నిఖిల్, మున్సిపల్ కమిషర్ కేవీ రమణాచారి, ట్రస్మా రాష్ట్ర నాయకుడు యానాల ప్రభాకర్‌రెడ్డి, యోగా గురువు మాదగోని శంకరయ్య, ధూప, దీప నైవేథ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలాతాబాద్ వాసుదేవశర్మ, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహనశర్మ, డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు పగిడిమర్రి ప్రసాద్ శర్మ, అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల వేణుగోపాల్‌రావు, బ్రాహ్మణ సంఘం ్రపతినిధి కొండోజ నవీన్‌కుమార్, స్ధానిక కౌన్సిలర్ బుర్రి రజిత, ఆలకుంట్ల రాజేశ్వరీ, వివిధశాఖల జిల్లా అధికారులు, బ్రాహ్మణులు, భక్తులు పాల్గొన్నారు.
రామగిరి : సీఎం కేసీఆర్ అన్ని మతాలను ఆదరిస్తున్నారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నల్లగొండలోని మసీదులు, చర్చిల్లో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గడియారం సమీపంలోని మదీనా మసీదులో జరిగిన వేడుకలో వారు పాల్గొని మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థ్ధనలు చేశారు. సీఎం కేసీఆర్‌కు ఇమామ్‌లు, ముస్లిం మత పెద్దలు దీవెనలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గంలో 164 మంది ఇమామ్‌లు, మౌజుమ్‌లకు గౌరవ వేతనం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. నల్లగొండలోని పాతబస్తీలో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, ముస్లిం మైనార్టీ నాయకులు ఫరీదొద్దీన్, జమాల్ ఖాద్రి, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్ధన్‌రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. భారత్ గ్యాస్ సమీపంలోని రివైవల్ బైబిల్ చర్చిలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు.