చండూరు: టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకర్గం సస్యశామలమవుతుందని మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన కమిటీల పరిచయ కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గాన్ని సస్యశామలం చేయడం కోసం రెండు వేల కోట్లతో రెండు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చామన్నారు.
నూతన కమిటీ సభ్యులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జనకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావా లని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు మునుగాల నారాయ ణరావు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షు డు గుర్రం వెంకట్రెడ్డి, జడ్పీటీసీ కర్నాటీ వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళ, వెంకన్న, పట్లణాధ్యక్షుడు భూత రాజు దశరథ, కౌన్సిలర్లు చిలుకూరి రాధిక, అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, ఎంపీటీసీ సత్తయ్య, గిరిబాబు, భిక్షం, వెంకన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.