నిడమనూరు, సెప్టెంబర్ 03 : నిరుపేదలందరికీ ఆహార భద్రతే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని మార్లగడ్డ క్యాంప్, మారుతీవారిగూడెం పంచాయతీల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు రేషన్ దుకాణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగి శివ మారయ్య, కొండా శ్రీనివాసరెడ్డి, అంకతి కృష్ణయ్య, బుర్రి వెంకన్న, మార్తి సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఉమ్మడి వల్లభ రెడ్డి, దోరెపల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు.