కట్టంగూర్, జూన్ 16 : కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసి, కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య అన్నారు. కట్టంగూర్‌లో సోమవారం అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.2.5 లక్షల కోట్ల నిధులు కేటాయించాలన్నారు.
కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించి రూ.600 కనీస వేతనం అందించి, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే గ్రామీణ హర్తాళ్ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘః జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన వెంకులు, జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యులు కల్లూరి కుమారస్వామి, ఒక్క బుచ్చిరాములు, డెంకెల లింగయ్య, మర్రి ఒక్కయ్య, అంజయ్య, నర్సింహ్మ పాల్గొన్నారు.